నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నారని జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బిజెపి పార్టీకి దూరమయ్యా.. కార్యకర్తగా మాత్రమే ఉన్నాననంటూ పేర్కొన్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఉద్యమాకాంక్షలు నెరవేస్తారని బిజెపిలో చేరానని.. తెలంగాణ ఆకాంక్ష బిజెపితో నెరవేరాదని అర్థమయిందని తెలిపారు.
బిజెపి బండి సంజయ్ ను మార్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 నెలలగా బిజెపిలో ఉన్నా.. ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదు…. బండి సంజయ్ ను తొలగించడం హీనమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు జిట్టా బాలకృష్ణారెడ్డి. డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేయడం లేదని.. కెసిఆర్ నిరంతృత పాలన పోవాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారు.. కార్యకర్తలతో సమావేశమైన తర్వాత నిర్ణయం చెబుతానని వెల్లడించారు జిట్టా బాలకృష్ణారెడ్డి.