హీరో విశాల్‌ కొత్త రాజకీయ పార్టీ?

-

సినిమా హీరోలు, నటులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణం. కొందరు ఇతర పార్టీల్లో చేరితే మరికొందరు సొంతంగా పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే తమిళ హీరో దళపతి విజయ్ తన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో తమిళ హీరో విశాల్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఆయన మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.

తన అభిమాన సంఘాన్ని ‘విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం’(విశాల్‌ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చిన విశాల్ అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించి బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు విశాల్‌ అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తూ, పరిష్కరిస్తున్నారు. ఇలా నిత్యం షూటింగులతో బిజీగా ఉన్నా ప్రజల మధ్యకూ వెళ్తూ తనలోని నాయకత్వ లక్షణాలను సజీవంగా ఉంచుకుంటున్నారు. ఇక త్వరలో విశాల్‌ మక్కల్‌ నల ఇయక్కం నిర్వాహకులను చెన్నైకి పిలిపించి వారితో మాట్లాడి పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విజయ్‌లాగే విశాల్‌ కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news