షూటింగ్‌ల‌కు హాట్ స్పాట్‌గా హైద‌రాబాద్‌.. క్యూ క‌డుతున్న త‌మిళ హీరోలు!

హైద‌రాబాద్ అంటే ఇప్పుడు షూటింగ్ ల‌కు ఎంతో అనుకూలంగా మారుతోంది. ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు ఎన్నో ర‌కాల మార్పులు రావ‌డంతో వ‌రుస‌గా సినిమా షూటింగ్ ల‌కు ఇత‌ర భాష‌ల హీరోలు కూడా ఇక్క‌డికే క్యూ క‌డుతున్నారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వ‌రుస సినిమాల‌తో హీరోలు ఇక్క‌డికే వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం కూడా త‌మిళ హీరోలు వ‌రుస‌గా వ‌స్తున్నారు. వారెవ‌రో చూద్దాం.

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు అన్నాత్తే సినిమా షూటింగ్ మెజార్టీ పార్ట్ మ‌న హైదరాబాద్ కే ప‌రిమితం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు సిటీలోని ఐకియా అలాగే శివారు ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అలాగే తాలా అజిత్ కూడా మొన్న‌టి వ‌ర‌కు దాదాపు రెండు నెలలు రామోజీ ఫిల్మ్ సిటీలో గ‌డిపారు.

ఇక వీరి త‌ర్వాత వ‌రుస‌గా కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ఇక్క‌డ‌కు వ‌స్తున్నారు. వీరి సినిమా కోసం అధికంగా షూటింగ్ షెడ్యూల్ మ‌న హైద‌రాబాద్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మ‌రో స్టార్ హీరో సూర్య కూడా సూర్య, ఆయ‌న త‌మ్ముడు అయిన కార్తీ కూడా త్వ‌ర‌లోనే హైర‌ద‌బాద్ బాట ప‌డుతున్నారు. వారి సినిమాల కోసం రామోజీ ఫిల్మ్ సిటీ ఐదారు వారాలు ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వీరే కాదు బాలీవుడ్ స్టార్లు కూడా హైద‌రాబాద్‌కే ప‌య‌న‌మ‌వుతున్నారు. మొత్తానికి షూటింగ‌లుకు హైద‌రాబాద్ హాట్ స్పాట్గా మారుతుంది.