ఫ్యాన్ చేసిన పని చూసి తమన్నా ఎమోషనల్.. ఎయిర్​పోర్టులోనే ఏడ్చేసిన బ్యూటీ

-

ప్రస్తుతం బీ టౌన్​లో బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్​లో నటించిన ఈ బ్యూటీ ఆ సిరీస్ ప్రమోషన్స్​లో తీరిక లేకుండా గడుపుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ముంబయి ఏయిర్​ పోర్టులో కనిపించి సందడి చేసింది. తమన్నాను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్​ అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో తమన్నాను చూసిన అభిమానులు ఒక్కసారైనా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ అకస్మాత్తుగా వచ్చి తమన్నా కాళ్లకు దండం పెట్టారు. తను తీసుకువచ్చిన పూల బొకేను.. ఓ గ్రీటింగ్ కార్డును తమన్నాకు ఇచ్చారు. టామీతో మాట్లాడుతూ.. తన చేతిపై పొడిపించుకున్న మిల్కీ బ్యూటీ టాటను చూపించారు. టాటూ కింద లవ్ యూ తమన్నా అని రాసి ఉంది. ఈ టాటూ చూసిన తమన్నా ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తన ఫ్యాన్​ను కౌగిలించుకొని ‘థ్యాంక్యూ ఫర్ యువర్​ లవ్​’ అంటూ కాసేపు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version