కేటీఆర్: 2014 లో చంద్రబాబుకు మోదీ దుర్మార్గుడు… ఇప్పుడేమో దేవుడా

-

తాజాగా తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ టీవీ 9 కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడారు. యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో క్లారిటీగా సమాధానం ఇస్తూ BRS ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ… చంద్రబాబు పరిస్థితులను బట్టి మతాలను మారుస్తాడు.. రాజకీయాన్ని తలక్రిందులు చేస్తూ ఉంటాడని మాట్లాడాడు. ఇక ఇందులో భాగంగా ఒక ప్రత్యేక విషయాన్ని గుర్తు చేశాడు… ఇదే చంద్రబాబు 2014 లో మోదీని దుర్మార్గుడు అంటూ నిందించాడు… ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు మాత్రం మోదీ దేవుడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నాడు.

రాజకీయ స్వార్ధం కోసం ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలా మార్చే దౌర్భాగ్యం మా నాయకులకు లేదన్నాడు. ఇటువంటి లాలూచీ రాజకీయాలు మా పార్టీ చేయదు అంటూ ఖరాఖండీగా చెప్పాడు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version