TarakaRatna: నటుడు తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా..?

-

సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయ పార్టీలలో తన హవా బాగా కొనసాగించారు. కానీ నందమూరి తారక రామారావు కు 12 మంది సంతానంలో 8 మంది మగపిల్లలు కలరు. ఇందులో 5వ కుమారుడే నందమూరి మోహన్ కృష్ణ. ఎప్పుడూ కూడా పెద్దగా వార్తలలో కనిపించరు. తన గురించి జనాలకు పెద్దగా తెలియకపోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు. అయితే నందమూరి మోహన్ కృష్ణ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ సినిమాలకు చాయాగ్రహకుడిగా కూడా పనిచేశారట.

నందమూరి మోహన్ కృష్ణ 1956 సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజుని జన్మించడం విశేషం అని చెప్పవచ్చు. తారక రామారావుకు రామకృష్ణ, జయ కృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ మోహనకృష్ణ, బాలకృష్ణ, జూనియర్ రామకృష్ణ, జయ శంకర కృష్ణ కలరు ఇందులో మోహనకృష్ణ 5వ వారు.. ఇక నలుగురు.. లోకేశ్వరి, పూరేందేశ్వరి ,భువనేశ్వరి, ఉమామహేశ్వరి కలరు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్న వయసులోనే మసూచి వ్యాధితో మరణించారు.

మరొక కుమారుడు హరికృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి లాగానే సినీ రంగంలో రాజకీయ రంగంలో కూడా బాగానే ఆకట్టుకున్నారు. 2018 ఆగస్టు 29 రోడ్డు ప్రమాదంలో మరణించారు. మోహన్ కృష్ణ విషయానికి వస్తే.. బాల్యం నిమ్మకూరులోని చెన్నైలో జన్మించారు. పెళ్లి సమయానికి వీరంతా హైదరాబాదులోనే సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాల పైన మక్కువ ఉండటంతో నటనపై కాకుండా సినిమాటోగ్రఫీ గా మోహన్ కృష్ణ అడుగులు వేశారు. అప్పటినుంచి బాబాయ్ త్రివిక్రమ్ రావుతో కలిసి పలు ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకునేవారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు స్వీయ దర్శకత్వం కూడా వ్యవహరించారు. 1980లో ప్రముఖ నిర్మాత యు విశ్వేశ్వరరావు కూతురి శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి నందమూరి తారకరత్న, నందమూరి రూప సంతానం కలదు. 2014లో ప్రముఖ వ్యాపారవేత్తతో రూప వివాహం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news