Warangal: ప్రపంచ సుందరీమణుల రాక..పేదల ఇళ్లు కూల్చివేత !

-

 

ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో.. వరంగల్‌లో హైటెన్షన్ నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు వచ్చే ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను తొలగించారు జీడబ్ల్యూఎంసీ అధికారులు. హన్మకొండ నుంచి కాజీపేట వరకు రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ జోన్స్ తొలగించిరు. పేదల ఇండ్లు కూడా కూల్చేశారని సమాచారం. జీడబ్ల్యూఎంసీ తీరుతో రోడ్డున పడ్డారు చిరు వ్యాపారులు.

Tensions rise in Warangal amid arrival of Miss World
Tensions rise in Warangal amid arrival of Miss World

దింతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య.

ఇక అటు ఈ విషయం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అందాల పోటీల్లో పాల్గొంటున్న వారి వరంగల్ పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై రాహుల్ గాంధీకి ఎక్స్‌ (X) మాధ్యమం ద్వారా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news