నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించడం నిజంగా వారి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ముగ్గురు పిల్లలు కూడా అనాధలు అయిపోయారు అనడం లో సందేహం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే ఆ కుటుంబానికి అండగా విజయసాయిరెడ్డి, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు లాంటి బడా నేతలు తామున్నామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆమె మనసుకు భరోసా ఇచ్చే విధంగా ఏ ఒక్కరు కూడా ప్రవర్తించలేకపోతున్నారు..ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే తారకరత్న అలేఖ్య రెడ్డిని కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు.
వేరే కులానికి చెందిన అమ్మాయి.. పైగా ముందే మొదటి భర్తతో విడాకులు కూడా అవడంతో ఇలాంటి కోడలు తమ ఇంటిలోకి ఆహ్వానించడానికి మోహనకృష్ణ దంపతులు ఆసక్తి కనపరచలేదు. దీంతో సుమారుగా 10 సంవత్సరాల పాటు తన కుటుంబానికి దూరమయ్యాడు తారకరత్న. ఇటీవల తారకరత్న మరణించినప్పుడు కూడా అటు తండ్రి మోహన్ కృష్ణ , ఇటు తల్లి శాంతి మోహన్ కూడా.. తారకరత్న 23 రోజులపాటు నారాయణ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడిన సందర్భంలో కూడా ఆయనను చూడడానికి తల్లిదండ్రులు రాలేదు అంటే వారి మధ్య చిచ్చు ఏ విధంగా రగులుతోందో అర్థం చేసుకోవచ్చు.
అయితే కొడుకు ఎలాగో పోయాడు.. కనీసం కోడలు, మనవడు మనవరాళ్లకైనా అండగా నిలవాల్సిన మోహన కృష్ణ కుటుంబం ఇప్పటికీ కూడా వారి వైపు చూడకపోవడమే అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. అయితే ఇలాంటి సమయంలోనే తారకరత్న తల్లి శాంతి మోహన్ అలేఖ్య రెడ్డి బాధను భరించలేక ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పర్సనల్గా శాంతి మోహన్ అలేఖ్య రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిందట అంతేకాదు పిల్లలతో కూడా ఆమె మాట్లాడినట్లు సమాచారం. ఏది ఏమైనా తారకరత్న మరణించిన తర్వాత కూడా మోహనకృష్ణ ఇంకా మొండి పట్టుదలను వీడకపోవడంతో అందరూ విమర్శిస్తున్నారు.