Big Boss Non Stop: ‘బిగ్ బాస్’ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్..కలిసిపోయిన బిందు మాధవి, అఖిల్..పాసుల కోసం పోటీపడుతున్న కంటెస్టెంట్స్

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో రోజురోజుకూ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కంటెస్టెంట్స్ గేమ్ ను చాలా బాగా ఆడుతున్నారు. ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్కు పూర్తి చేసేందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ను తాజాగా ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ కు ఇచ్చింది. దాంతో వారు ‘కెప్టెన్సీ’ టాస్కులో భాగంగా ఇతర కంటెస్టెంట్స్ తో పోటీపడుతున్నారు.

బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ‘ఇది మా అడ్డా’..ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇంటిని ఐదు ఏరియాలు విభజించారు. అందులో పాసెస్ పెట్టగా, వాటిని కంటెస్టెంట్స్ కలెక్ట్ చేసుకుని వాటిని తమ వద్ద పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్స్ ఆయా ఏరియాల్లో నిలబడి ఉన్నట్లు ‘బిగ్ బాస్’ తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది.

ఇతర కంటెస్టెంట్స్ వద్ద ఉన్న ఫ్లాగ్స్ దక్కించుకునేందుకు కంటెస్టెంట్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గొడవ పడ్డ బిదు మాధవి, అఖిల్ ఇప్పుడు కలిసి పోయారు. ‘కెప్టెన్సీ’ టాస్కు గెలిచేందుకు ఒకరికి మరొకరు సహకరించినట్లు ప్రోమోలో తెలుస్తున్నది.

అయితే, ఈ వారమైన శివ కెప్టెన్ గా అవుతారా? అని బీబీ లవర్స్ అయితే చర్చించుకంటున్నారు. కెప్టెన్సీ పోటీదారుల్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.. ఏం జరుగుతుందో తెలియాలంటే మంగళవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news