టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే… తాజాగా తెలుగు దర్శకుడు తండ్రి కన్నుమూశారు. తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తండ్రి ఏలేటి సుబ్బారావు తాజాగా మరణించారు. 75 సంవత్సరాలు ఉన్న చంద్రశేఖర్ ఏలేటి తండ్రి ఏలేటి సుబ్బారావు…. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రేగవాని పాలెం లోని తన నివాసంలో… ఇవాళ ఉదయం మరణించినట్లు… కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అలాగే రాజమౌళి భార్య ఆ కుటుంబాన్ని ఈ సందర్భంగా పరామర్శించారు. అయితే సినిమాతో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖర్ ఏలేటి… ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఒక్కడున్నాడు, సాహసం, ప్రయాణం,…