ఉగాది పండుగ రోజున తప్పకుండా పాటించాల్సిన విషయాలు ఇవే..!

-

హిందువులు అందరూ ఎంతో ఆనందంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రావడం జరిగింది. ఆ రోజున కొన్ని పనులను చేయడం వలన సంవత్సరం మొత్తం ఎంతో బాగుంటుందని, ఆనందంగా జీవించవచ్చు అని చాలా శాతం మంది భావిస్తారు. కనుక ఉగాది పండుగ రోజున ఇటువంటి పనులను చేసి ఎంతో ఆనందాన్ని పొందండి. ఈ సంవత్సరం ఉగాది పండుగ తో విశ్వసనామ సంవత్సరం వస్తుంది. విశ్వావసు అనే పేరు విష్ణుమూర్తిది. ఈ విశ్వసనామ సంవత్సరంతో ఎంతో మంచి జరగవచ్చు మరియు అందరూ క్షేమంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా విశ్వసనామ సంవత్సరంలో పంటలు ఎంతో బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారు. ఈ విధంగా రైతుల జీవితాలు అభివృద్ధి కూడా చెందుతాయి. అంతేకాకుండా బట్టల వ్యాపారులకి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉగాది పండుగ రోజున తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నువ్వుల నూనె రాసుకుని తల స్నానం చేయాలి. ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకుని కాషాయం జెండాను ఇంటికి కట్టాలి. ఇలా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఉగాది పండుగ రోజున మంచి కార్యక్రమాలను నిర్వహిస్తారో చాలా మంచి ఫలితాన్ని పొందుతారు.

ముఖ్యంగా చలివేంద్రాలను పెట్టడం వలన బాటసారులకి ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా చలివేంద్రాలు పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. చలివేంద్రాలతో పాటుగా జంతువులకి, పక్షులకి నీళ్లను ఏర్పాటు చేయడం వలన ఎంతో పుణ్యంను పొందవచ్చు. ఉగాది పండుగ రోజున అందరూ ఉగాది పచ్చడిని తీసుకుంటారు. ఉగాది రోజున ఉగాది పచ్చడిని తీసుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. శతాయుష్యం వజ్ర దేహం దదాత్యార్థం సుఖానిచ.. సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్. ఇలా శ్లోకం చదివి ఉగాది పచ్చడి తింటే సంవత్సరం మొత్తం ఎంతో మంచి జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version