మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) చిల్లర రాజకీయాలు చేస్తోందని సన్ రైజర్స్ (SRH)జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ లేఖలోని సారాంశం ప్రకారం.. ‘పన్నెండేళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం. గత 2 సీజన్ల నుంచి తమకు చాలా వేధింపులు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏకు 10 శాతం (3,900) కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే.
కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని కోరారు. ప్రతీ మ్యాచ్‌కూ మేము స్టేడియం అద్దె చెల్లిస్తున్నాం. ఐపీఎల్ టైంలో స్టేడియం మా కంట్రోల్‌నే ఉండాలి.కానీ, గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారు.అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారని హెచ్‌సీఏ మీద ఆ లేఖలో ఫైర్ అయ్యారు. కాగా, ఈ లేఖ వ్యవహారంపై సర్వత్రా చర్చ నెలకొంది.