ఉగాది పండుగ పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం ఉదయం రవీంద్ర భారతితో పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఆ వెంటనే రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారరు.
సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, కొత్త మంత్రివర్గం విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని ఆయన గవర్నర్‌కు అందజేసినట్లు తెలిసింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అప్డేట్ గురించి వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం నలుగురు మంత్రులకు కేబినెట్‌లో చోటు కల్పిస్తుండగా..నేడు మధ్యాహ్నం దానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.