మంచి మార్కుల కోసం.. విద్యార్థులు పాటించాల్సిన విషయాలు ఇవే..!

-

ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఏకాగ్రత ఎంతో అవసరం. శ్రద్ధగా చదువుకోడానికి ఎంతో ప్రయత్నం చేసినా చాలా శాతం మంది దృష్టి పెట్టలేరు. అయితే ఇంట్లో ఉండే సానుకూల శక్తి వలన చదువుకున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. చాలా శాతం మంది వాస్తు నియమాలను పాటించకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. దానివలన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక ప్రతికూల శక్తి తొలగిపోయి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తప్పకుండా వీటిని పాటించాల్సిందే. మంచి మార్కులను పొంది ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఈ వాస్తు నియమాలను పాటించండి.

చదువుకునేటప్పుడు దక్షిణం వైపు అస్సలు కూర్చోకూడదు. ఇలా కూర్చోవడం వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మీ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో సానుకూల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ పరిసరాలలో లేక స్టడీ రూమ్ లో సానుకూల శక్తి ఇచ్చేటువంటి పెయింటింగ్స్, ఫోటోలు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో ఏకాగ్రతగా చదవవచ్చు. తూర్పు వైపు కూర్చొని చదవడం వలన సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది మరియు తూర్పు వైపు కూర్చొని చదివే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. దీంతో ఎంతో ఏకాగ్రతగా చదువుతారు.

అదేవిధంగా ఉత్తరం వైపున కూడా కూర్చొని చదవవచ్చు. ఎప్పుడైతే ఉత్తరం దిశలో కూర్చుని చదువుతారో ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మంచి ఏకాగ్రత ఉండడం వలన మంచి మార్కులను కూడా పొందవచ్చు. పైగా దేవుని అనుగ్రహాన్ని పొంది మంచి మార్కులు పొందారు. కనుక తప్పకుండా ఈశాన్యం వైపు కూర్చోవాలి. ఇలా చేయడం వలన ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు, ముఖ్యంగా చదివిన ప్రతి విషయం కూడా గుర్తుంటుంది. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం చదువుకోవడానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ దిక్కులలో కూర్చోడం కుదరకపోతే పడమర వైపు కూర్చోవచ్చు. దిశ తో పాటుగా చదువుకునే గది ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి అని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందవచ్చు మరియు ఏకాగ్రత కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version