ఎంజీఎం ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్విగ్న వాతావ‌ర‌ణం!

గాన గంధ‌ర్వుడిగా దేశ వ్యాప్తంగా జేజేలందుకున్నారు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం. గ‌త 40 రోజులుగా ఆయ‌న క‌రోనా కార‌ణంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొంత‌దుతున్నారు. ఆయ‌న‌కు క‌రోనా సోకింద‌ని తెలిసిన వెంట‌నే ఆవేద‌న చెంద‌న అభిమాని అంటూ ఎవ‌రూ లేరేమో. ఆయ‌న మ‌హ‌మ్మారి నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు కూడా చేశారు. ఇళ‌యారాజా బాలూ లేచినా నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ ఓ వీడియో సందేశాన్ని కూడా షేర్ చేశారు.

ఆయ‌నే కాదు దేశ రాష్ట్ర ప‌తి నుంచి దేశ‌ వ్యాప్తంగా వున్నా సెల‌బ్రిటీలు అంతా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డాల‌ని దేవుడిని ప్రార్థించారు. సామూహిక ప్రార్థ‌న‌లు చేశారు. ప‌రిస్థితి మారిన‌ట్టే మారి మ‌ళ్లీ బాలు ఆరోగ్యం గురువారం మ‌ధ్యాహ్న‌నికి అత్యంత విష‌మంగా మార‌డం ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానుల్ని, ఆయ‌న‌తో అనుబంధం వున్న సెల‌బ్రిటీల‌ని భ‌యాందోళ‌న‌కు, ఆవేద‌న‌కు గురిచేస్తోంది. నిన్న‌టి నుంచి ఎంజీఎం ఆసుప‌త్రి సెల‌బ్రిటీల రాక‌పోక‌ల‌తో విషాద ఛాయ‌ల్ని అలుముకుంటోంది.

గురువారం అర్ధ్ర రాత్రి వ‌ర‌కు సెల‌బ్రిటీలు ఎంజీఎం ఆసుప‌త్రికి ఒక్కొక్క‌రుగా రావ‌డం బాలు కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించ‌డంతో ఒక్క‌సారిగా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో విషాద ఛాయ‌లు అలుముకుంటున్నాయి. ఏ క్ష‌ణాన ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందో న‌ని అంతా భ‌యప‌డుతూ విష‌న్న విద‌నాల‌తో బావురు మంటున్నారు. ఈ వార్త చెవిన ప‌డిన ప్ర‌తీ ఒక్క‌రూ దేవుడా మా బాలుని కాపాడు అంటూ బ‌రువెక్కిన గుండెల‌తో ప్రార్థిస్తున్నారు.