బ్రేకింగ్ : పరువు హత్య కేసులో 9 మంది అరెస్ట్ !

హైదరాబాద్‌ లో పరువు హత్య కేసు కలకలం రేపుతోంన్న సంగతి తెలిసిందే. కన్న కూతురు తనకు ఇష్టం లేకుండా వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు చందానగర్ కు చెందిన లక్ష్మా రెడ్డి. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యువతి తండ్రికి ఇష్టం లేకపోవడంతో వీళ్లు గచ్చిబౌలి వచ్చేసి ఇక్కడే నివాసముంటున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించని యువతి తండ్రి లక్ష్మారెడ్డి అమ్మాయి మేనమామ సాయంతో నమ్మించి హేమంత్‌ను బయటికి తీసుకెళ్లాడు.

అయితే విషయం అర్ధం అయిన సదరు యువతి కారులో నుంచి దూకి పారిపోయి, డయల్’ 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపిస్తోంది. ఆ తర్వాత యువతి మేనమామ హేమంత్‌కు ఉరి వేసి చంపాడు. ఆ తర్వాత హేమంత్‌ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలోకి తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ హత్య సమాచారం తెలుసుకుని టనా స్థలానికి వెళ్లి హేమంత్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ కు తరలించారు. హేమంత్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సంగారెడ్డి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. నిన్న అర్ధరాత్రి ఆ ప్రాంతంలో పోలీసు వాహనాలను చూసి అక్కడికి సంగారెడ్డి పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. దీంతో హేమంత్ మర్డర్ జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు తెలుసుకున్నారు. ఇక ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.