BREAKING: అడ్డంగా దొరికిపోయిన హేమ…డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ ?

-

అడ్డంగా దొరికిపోయింది నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ అయినట్లు సమాచారం అందుతోంది. డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్దారించిన పోలీసులు… నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారట. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కొటిక్ టీమ్ పరీక్షించింది.

Test confirmed that actress Hema took drugs at Bangalore rave party

పరీక్షించిన డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. అందులో టాలీవుడ్ సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇందులో పలువురు సీనిప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news