ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో కేంద్రానికి కర్ణాటక సర్కార్ లేఖ

-

కర్ణాటకలో హాసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్న సెక్స్ స్కాండల్ ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. వందల మంది మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు, వాటికి సంబంధించిన పలు అసభ్య వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయ ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పరమైన పాస్‌ పోర్టును రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధరామయ్య లేఖ రాశారు.

విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణను తిరిగి దేశానికి రప్పించడానికి సత్వరమే సమగ్రమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం మోదీని కోరారు. దౌత్యపరమైన పాస్‌పోర్టు ద్వారా ఏప్రిల్ 27వ తేదీన ప్రజ్వల్‌ జర్మనీ పారిపోవడాన్ని సిగ్గుచేటు చర్యగా ప్రధానికి రాసిన లేఖలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. విదేశాంగ శాఖకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news