పల్నాడు పరిస్థితులపై మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారణం…ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహించారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన మా వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్ లేదంటున్నారు..కత్తులు, కర్రలతో పరామర్శలకు వెల్లిన వారికి, పర్మిషన్లు ఇచ్చారన్నారు.
మేము మా వాళ్ళని మనసు తో పలకరిద్దామని అనుకుంటే పర్మిషన్ ఇవ్వరా? తప్పనిసరి పరిస్థితిలోనే నేటి మాచర్ల పర్యటన వాయిదా వేసుకున్నానని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పోలీస్ పర్మిషన్ తీసుకొని మాచర్ల పర్యటనకు వెళ్తా…టిడిపి పోలీసులు కలిసిపోయారు అని వైసిపి చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని చెప్పారు.
ఐదేళ్లుగా టిడిపి నాయకులను వేధించిన పోలీసులు ఇప్పుడు మాతో ఎందుకు కలుస్తారు..ప్రధాని మోడీ సభకే పోలీసులు సరైన భద్రత ఇవ్వలేకపోయారని వివరించారు.
పల్నాడులో శాంతిభద్రతలను కట్టడి చేయలేకపోయారు…ఇప్పుడు పోలీసుల్లో మార్పు మాకు అవసరం లేదన్నారు. పలనాడులో ప్రశాంత వాతావరణం రావాలంటే రెచ్చగొట్టే నాయకులు మాచర్ల బయట ఉండాలి…పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని డిమాండ్ చేశారు.