TFCC Elections : నేడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు…

-

నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.

ఫిలిం ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా… 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఈ ఎన్నికలలో ఎలాంటి వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు, ఫిలిం ఛాంబర్ ను బలంగా చేయడానికి నిర్మాతలు అంతా ముందుకు వచ్చి ఎన్నికల బరిలో నిలిచామని చెప్పుకొచ్చారు దిల్ రాజు. మా ప్యానెల్ లో వ్యాపారస్తులు అంతా ఉన్నట్లు పేర్కొన్నారు దిల్ రాజు. దిల్ రాజు మాట్లాడుతూ ఎక్జిబిటర్ లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడం కోసం సరైన టీం కావాలి అంటూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news