తలపతి66 అప్‌డేట్..కీలక పాత్రల్లో ప్రముఖ నటులు

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ -డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న పిక్చర్ ‘తలపతి 66’. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో క్యూట్ బ్యూటీ రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి రచించిన స్టోరి విజయ్ కు చాలా బాగా నచ్చిందట. దిల్ రాజు కూడా స్టోరి లైన్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్ డేట్ ఇచ్చేశారు. కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను తీసుకున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్ నటుడు ప్రభు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

శరత్ కుమార్ పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకమని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తలపతి 66’ . ఈ నేపథ్యంలోనే పిక్చర్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news