దిల్ రాజు సినిమాలో హీరో విజయ్ తండ్రిగా సీనియర్ యాక్టర్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగులో మొదటి సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్  బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రూపొందుతోంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా రాబోతోంది. ఇటీవలే ఈసినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. చెన్నైలో గ్రాండ్ గా షూటింగ్ లాంచ్ చేశారు. దళపతి విజయ్ 66 సినిమా వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. రష్మికా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ కు తండ్రిగా సినియర్ హీరో శరత్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ మధ్య తమిళ సినిమాకే ఎక్కువగా పరిమితమై.. పెద్దగా తెలుగులో సినిమాలు చేయని శరత్ కుమార్ మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.