ట్రెండ్ ఇన్: లోకేశ్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో మరోసారి విజయ్..‘మాస్టర్’ను మించిన ఎక్స్‌పెక్టేషన్స్

-

తమిళనాట ఇళయ తలపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ ఫంక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ అని పేర్కొన్న సంగతి అందరికీ విదితమే. కాగా, విజయ్ నటిస్తున్న, నటించబోయే చిత్రాల అప్ డేట్స్ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు సినీ అభిమానులు. గతంలో తలపతి విజయ్, వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిలను కలిపి ‘మాస్టర్’ సినిమా తీసిన లోకేశ్ కనకరాజ్ మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

‘తలపతి 67’ వెరీ స్పెషల్ ఫిల్మ్ గా ఉండబోతున్నదని టాక్. ‘మాస్టర్’ పిక్చర్ ను మించి ఈ మూవీ ఉంటుందని వినికిడి. ఈ సారి కంప్లీట్ గా ఫోకస్ విజయ్ పైనే ఉంటుందట. లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బిజీగా ఉన్న ఆయన ..త్వరలో విజయ్ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారని టాక్. ‘తలపతి 66’ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news