దేవర రిజల్ట్.. థ్యాంక్స్ కొరటాల శివ అంటూ ఎన్టీఆర్ ట్వీట్..!

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా..? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ రాత్రి 1గంటల నుంచే స్పెషల్ షోలు పడ్డాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. 23 ఏళ్ల తరువాత తన సెంటిమెంట్ బ్రేక్ అయిందంటూ.. రాజమౌళి కుమారుడు ట్వీట్ చేయడం విశేషం.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా రిజల్ట్స్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మీ అధ్బుతమైన రియాక్షన్ చూసి నేను ఆనందపడుతున్నాను. దేవర లాంటి ఒక ఎంగేజింగ్ డ్రామాను ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ అందించినందుకు దర్శకుడు కొరటాల శివ కి థ్యాంక్స్. నా సోదరుడు అనిరుధ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తం ఒక్కసారిగా కొత్తలోకంలోకి తీసుకెల్లినట్టు అనిపించింది. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని ఇద్దరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో అభిమానులుగా మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news