తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమై ఈ కామెడీ షో తో మంచి పేరు సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . అయితే కొత్తలో కొంతకాలం జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ ను విమర్శించిన విషయం తెలిసిందే. జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత వేరే ఛానల్స్ కి వెళ్లారు. కానీ అక్కడ వర్క్ అవుట్ కాక సొంతంగా బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఆర్ పీ.. ఇటీవల కిర్రాక్ ఆర్పి “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” పేరుతో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఒక కర్రీ పాయింట్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆయనకు ఉన్న ఇమేజ్తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కి ఊహించిన దాని కంటే ఎక్కువ కష్టమర్సే వచ్చారు..ఈ క్రమంలోనే అక్కడ పరిసర ప్రాంతాలలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తాత్కాలికంగా కర్రీ పాయింట్ను క్లోజ్ చేసి ఆ తర్వాత వేరే ప్రాంతాలలో ఓపెన్ చేశాడు.. అయితే ఈమధ్య తమ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి బాగాలేదని కొంతమంది పనికొట్టుకొని రూమర్స్ సృష్టిస్తున్నారని అదంతా పెయిడ్ బ్యాచ్ పనే అని చెబుతున్నాడు ఆర్ పి.
జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని.. మోసం చేసి ఎన్ని రోజులు బిజినెస్ చేయలేరని.. తాను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని తెలిపారు అంతేకాదు పెయిడ్ బ్యాచ్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు కిరాక్ పార్టీ.నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను.. నన్ను ఎవరు బ్యాడ్ చేయలేరు.. ఎంత నెగిటివ్ చేస్తే నాకు అంత ప్రమోషన్ అని చెబుతున్నాడు కిర్రాక్ ఆర్పీ..