హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.

 

hyderabad traffic
Traffic restrictions in Hyderabad till 11 pm tonight

మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్ కానున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. చార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల లోపు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు. చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news