ఆ ఒక్క డైలాగ్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది!

ఇండ‌స్ట్రీలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అంటే తెలియ‌ని వారుండ‌రు. వారి ఏదైనా సినిమా చేస్తే అందులో డైలాగులు ఓ రేంజ్లో ఉండే విధంగా చూసుకుంటారు. వాస్త‌వానికి వారి కెరీర్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా డైలాగులే. అయితే అప్ప‌ట్లో ఎన్టీ రామారావుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన అనేక సినిమాల‌కు వీరు క‌థ‌లు రాసేవారు.

అయితే అప్ప‌ట్లో కృష్ణ‌కు వీరు మొద‌ట్లో క‌థ‌లు రాసేట‌ప్పుడు వీరి కెరీర్ మ‌రో ట‌ర్న్ తీసుకుంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, కృష్ణగారు వీరికి సినీ జీవితాన్ని ప్ర‌సాదించారు. కృష్ణ ఎక్కువసేపు కథను వినేవారు కాదంట అప్ప‌ట్లో. ఆయ‌న ఓ 15 నిమిషాల్లో కథ మొత్తం ఒక లైన్‌లో విని త‌న ఒపీనియ‌న్ చెప్పేవారంట‌.

ఇక ఇదే క్ర‌మంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ బంగారుభూమి సినిమాకి డైలాగులు రాశారంట‌. అయితే ఈ సినిమాలో వారు రాసిన మనిషిని నమ్ముకుంటే మన నోట్లో ఇంత మట్టికొడతాడు అనేది కృష్ణ చెప్పాడంట‌. ఈ డైలాగు చ‌దివిన కృష్ణ‌కు బాగా న‌చ్చ‌డంతో పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏకంగా ఎనిమిది సినిమాల‌కు వ‌రుస‌గా క‌థ‌లు రాయించుకున్నారంట‌. దాంతో వారి కెరీర్ ఒక్క‌సారిగా మ‌లుపు తిరిగింది.