ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేసిన దర్శకధీరుడు..

-

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అర్ అర్ అర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శనివారం అర్ అర్ అర్ సినిమాను లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక డీజీఏ థియేటర్‌లో ప్రదర్శించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఆస్కార్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు మాట్లాడుతూ ప్రశంసలు వర్షం కురిపించుకున్నారు..

 

గత ఏడాది విడుదలైన అర్ అర్ అర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్అప్ సంపాదించుకుంది ఈ చిత్రం ఐతే తాజాగా ఆస్కార్ రేస్ లో సైతం నిలబడింది అలాగే ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు భారత ప్రభుత్వం నామినేట్ చేయనప్పటికీ.. స్వతంత్ర హోదాలో అకాడమీ అవార్డ్స్ రేసులో నిలబడింది.

అలాగే ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూసి కొందరు హాలీవుడ్ నటులు బెస్ట్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో తప్పకుండా నామినేట్ అవుతుందని చెబుతున్నారు అయితే ఈ నాపద్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు రాజమౌళి ఎన్టీఆర్.. ఆస్కార్ ఓటర్ల కోసం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డీజీఏ థియేటర్‌లో ఈ సినిమాను శనివారం ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్..

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన మాటలతో ఆకట్టుకున్నారు అలాగే ఈ సినిమా కోసం తామంతా ఎంత కష్టపడ్డాము చెప్పుకొచ్చారు అలాగే దర్శకుడు రాజమౌళి తనకు కావలసిన విధంగా సినిమా వచ్చేంతవరకు ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు.. అలాగే మంచి హిట్ అయినా నాటు నాటు పాట కోసం 12 రోజులు కష్టపడ్డామని చెప్పుకొచ్చారు.. అలాగే అప్పటికీ మానిటర్ ముందు కూర్చొని తనది, చరణ్‌ది ప్రతి స్టెప్ సింక్ అవ్వాలని ఫ్రేమ్ బై ఫ్రేమ్ రాజమౌళి చూసేవారని అన్నారు. రాజమౌళి టార్చర్ పెట్టినప్పుడు బాధపడినా.. పాట ప్రోమో విడుదలయ్యాక అద్భుతంగా అనిపించిందని ఎన్టీఆర్ వెల్లడించారు.

అలాగే రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట తన ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పారు. ‘‘ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మనం కెమెరాను అతడి కనుబొమ్మ దగ్గర పెడితే.. ఆ కనుబొమ్మతో నటించగలడు. అంత గొప్పగా ఉంటుంది ఇతడి నటన. కానీ రామ్ చరణ్ అలా కాదు. అతడితో నేను ‘మగధీర’ సినిమా చేశాను. ఆ సినిమాలో చరణ్ అద్భుతంగా నటించాడు. అతడిలో బోలెడంత ఎనర్జీ ఉన్నా.. దాన్ని బయటకు తీయలేదు. కానీ, RRR సినిమాకు వచ్చేసరికి చరణ్ చాలా డెవలప్ అయ్యాడు. నిజానికి చరణ్‌కు స్టోరీ తెలుసు, ఆ రోజు ఏం షూట్ చేస్తామో తెలుసు. అయినా అవన్నీ తన మైండ్‌లో నుంచి చెరిపేసి తెల్లకాగితంలా వచ్చేవాడు. ఆ తెల్లకాగితం మీద మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అనేవాడు. తనలోని నటనను డెవలప్ చేసుకున్నాడు. ప్రతిసారీ నన్ను సర్‌ప్రైజ్ చేసేవాడు. నాకు ఇలా వద్దు అలా చేయ్ అంటే వెంటనే చేసేసేవాడు’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Exit mobile version