ఇవాళ సాయంత్రం ఆటో కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం సమావేశం

-

మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆటో యూనియన్‌ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం అవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అటో యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సమావేశం కానున్నారు.

మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో అటో డైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని సర్కార్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో 14 ఆటో యూనియన్ ప్రతినిధులతో సమవేశమై వాళ్ల సమస్యలు వాటి పరిష్కారం పట్ల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆటో డైవర్లు యూనియన్ నేతలు ఇటీవల కాలంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సంక్షేమ బోర్డు ఆర్ధిక సాయం అందజేయాలని యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది వివక్షతో కూడిన నిర్ణయం అని జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news