విజయ్​ కి మళ్లీ నిరాశే.. ‘ఫ్యామిలీ స్టార్’​ ఫస్ట్ డే కలెక్షన్స్​ ఎంతంటే?

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ద ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తోంది.  గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో భారీగా హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమా ఆ అంచనాలను చేరుకోలేకపోయినట్లు సమాచారం. ఈ చిత్రానికి మిక్స్​డ్​ రివ్యూస్ వస్తున్నాయి.

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం థియేటర్లో కాస్త నిరాశనే మిగిల్చిందని తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఇండియా వైడ్​గా రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 38.45 శాతం మాత్రమే అని, మార్నింగ్ షో 37.21 శాతం, మధ్యాహ్నం షో 40.85శాతం, ఈవెనింగ్ షో 34.81శాతం, నైట్ షోకు 40.92శాతం మాత్రమే థియేటర్లు నిండినట్లు తెలుస్తోంది. యూఎస్​లో మాత్రం మంచి రెస్పాన్స్ రావడంతో 475కే డాలర్లుకుపైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news