కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సంగారెడ్డి లో రైతు దీక్షలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ… రైతు బంధు రాలేదు అంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడుతా అంటాడు… కేసీఆర్ హయాంలో పంటలు పండటం తప్ప ఎండటం తెలియదన్నారు. కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కరువు తెచ్చింది… ఈ రోజు రాహుల్ గాంధీ కొత్త మేనిఫెస్టో పెడుతారట..? అంటూ నిలదీశారు.
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోనే నెరవేర్చలేదు… ఇంకా ఈ కొత్త మేనిఫెస్టో ఎందుకు..? రైతులెవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..రైతులకు BRS పార్టీ అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాలు పెట్టగానే బీజేపీ కళ్ళు తెరిచి దీక్షలు చేస్తున్నారు… బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అన్నారు. కేసీఆర్ హయాంలో పంట బాగా పడితే బిజెపి మేము కొనము నూకలు బుక్కమని చెప్పింది…నూకలు బుక్కమని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. పంట ఎండిపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.