RGV కి షాక్… ఓటీటీలోనూ రిలీజ్ చేయొద్దు: కోర్టు

-

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ విడుదల చేయవద్దని రెండురోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేసింది.

The Hyderabad City Civil Court stayed the release of Ram Gopal Varma Vyuham

ఇది ఇలా ఉండగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news