తెలంగాణ రవాణా శాఖలో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా OD లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని OD లపై పని చేస్తున్న MVI, AMVI, Head constables, constablesల OD రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా…400 కోట్లతో 80 కొత్త బస్సులు ప్రారంభించింది తెలంగాణ ఆర్టీసీ. ఈ సందర్భంగా TSRTC ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ… ఆర్టీసీ మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభిస్తుందన్నారు.
400 కోట్లతో 80 కొత్త బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు TSRTC ఎండీ సజ్జనార్. 1000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. మే, జూన్ వరకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మహిళల కోసం ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది ప్రభుత్వం… ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు TSRTC ఎండీ సజ్జనార్. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు TSRTC ఎండీ సజ్జనార్.