Chiranjeevi : సినీ చరిత్రలో అతి పెద్ద కటౌట్‌.. సూర్యాపేటలో ఏర్పాటు

-

మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ తరుణంలోనే.. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద 120 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు మెగాఫ్యాన్స్‌.
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్యాపేట జాతీయ రహదారి పక్కన రాజుగారి తోట రెస్టారెంట్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news