కేజిఎఫ్ అనే సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఆ సినిమాతో అతనికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. నటనతో పాటుగా అతని స్టైల్ కి కూడా అభిమానులు ఫిదా అయిపోయారు. కీలక సన్నివేశాల్లో అతని నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు కేజిఎఫ్ రెండో పార్ట్ లో నటిస్తున్నాడు ఈ యువ స్టార్ హీరో. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 2019 మార్చి 7న కర్ణాటక కరుడుగట్టిన నేరస్తుడిగా పేరున్న స్లం భరత్ యష్ ని హత్య చెయ్యాలని భావించి ప్లాన్ చేసాడు. అప్పుడు ఈ వార్త హల్చల్ అయింది. ఆ తర్వాత అతన్ని పోలీసులు గుర్తించి ప్లాన్ పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు యష్. ఇప్పుడు అతన్ని పోలీసులు కాల్చి చంపారు.
దాదాపు 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్న భరత్… రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేసారు.. ఆ తర్వాత బెంగళూరుకు తీసుకొచ్చారు. అతను క్రైమ్ సీన్‌లో రీ కన్సట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని కాల్చి చంపారు పోలీసులు. తమపై కాల్పులు జరపడానికి ప్రయత్నాలు చేయడంతో కాల్చి చంపారు. ఒక బుల్లెట్ ఎస్సైకి తగిలింది. మరో బుల్లెట్ వెహికల్‌కు తాకిందని వాళ్లు చూపించారు.
బల్లెట్ ప్రూప్ జాకెట్ ఉండటంతో ఎస్సైకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. నిందితుడు అక్కడ్నుంచి కారులో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించడంతో.. మరో దారి లేక పోలీసులు కూడా వెంబడించి హేసరఘట్ట ప్రాంతం దగ్గర ఇరు వర్గాల మధ్య కాల్పులు జరపడంతో భరత్ గాయపడ్డాడు. దీనితో అతన్ని వెంటనే రెండు ఆస్పత్రులకు తీసుకువెళ్ళినా పరిస్థితి విషమించడం తో చనిపోయాడు.