ఇటీవల ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖపట్టణం విమానాశ్రయం దగ్గర వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా గుడ్లతో మరియు చెప్పులతో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి కూడా చేయడం కూడా జరిగింది. దీంతో వెంటనే విమానాశ్రయం బయట రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు చంద్రబాబు. దీంతో జనాలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి చంద్రబాబు అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ కి పంపించడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న టిడిపి నాయకులు ఇదే స్థాయిలో రివేంజ్ ఉండాలి అని వైసీపీ బలంగా ఉండే కర్నూల్ ప్రాంతంలో సరికొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రులలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్డర్.
ఇటీవల అదే నియోజకవర్గంలో వైసిపి కుర్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతి విషయం తనకు అడ్డు రావడంతో పాటుగా సిద్ధార్థ రెడ్డికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ ఉంటున్న నేపథ్యంలో..ఎమ్మెల్యే ఆర్థర్ ఇటీవల ఎవరూ ఊహించని స్కెచ్ వేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే కర్నూలులో టిడిపి నాయకులకు సన్నిహితంగా ఉంటూ రాబోయే రోజుల్లో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత పార్టీ మంత్రి అనిల్ ని కర్నూల్ ప్రాంతంలోనే అడుగుపెట్ట నివ్వకుండా భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం. దీనివల్ల కర్నూలు లోనే వైసీపీ నాయకులలో లోలోపల గొడవ వచ్చేలా ఎమ్మెల్యే ఆర్థర్ టిడిపి నాయకులతో వ్యూహాలు పన్నినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.