ఆ సినిమాను వ‌ద‌ల‌కుండా ఉండాల్సింది.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ వైర‌ల్‌!

-

మొద‌ట ఒక హీరోకు వినిపించిన క‌థ‌ను మ‌రో హీరో చేయ‌డం అనేది చాలా కామ‌న్‌. ఎందుకంటే ఆ హీరోకు ఆ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డ‌మో లేక ఇంకేదైనా కార‌ణాల‌తో పక్క‌న పెట్టొచ్చు. అయితే అలా వ‌దుల‌కున్న క‌థ‌లు కొన్నిసార్లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కూడా అవుతాయి. ఆ త‌ర్వాత అన‌వ‌స‌రంగా వ‌ద‌లుకున్నామే అనుకుంటారు చాలామంది. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అయిన ఢిల్లీ బెల్లీకి మొద‌ట‌గా అమీర్ ఖాన్ అభినయ్ డియో అనే డైరెక్ట‌ర్‌తో ప్లాన్ చేశాడు. ఈ క‌థ‌ను ఆయ‌న స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కు చెప్పమని అభిన‌య్‌ను ఆయ‌న వ‌ద్ద‌కు పంపాడంట అమీర్‌. కాక‌పోతే రణ్ బీర్ కపూర్ దీనిపై అభ్యంత‌రం చెప్పాడంట‌.

రణ్ బీర్ కపూర్ /Ranbir Kapoor
రణ్ బీర్ కపూర్ /Ranbir Kapoor

ఎందుకంటే తాను ఈ మూవీ చేస్తే తన తల్లిదండ్రుల ముందు ముఖం చూపుకోలేన‌ని చెప్పిసున్నితంగా తిర‌స్క‌రించాడంట‌. ఎందుకంటే ఇందులో విపరీతంగా బూతు డైలాగులు ఉంటాయ‌ని, అవ‌న్నీ అడల్ట్ కంటెంట్ చుట్టూ తిరుగుతుంద‌ని భావించిన రణ్ బీర్ కపూర్ త‌న‌కు క‌రెక్ట్ కాద‌ని దీన్ని వదిలేశాడంట‌. చివ‌ర‌కు అమీర్ ఖాన్ మేనల్లుడు అయిన ఇమ్రాన్ ఖాన్ న‌టించ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే విష‌యాన్ని ర‌ణ్‌బీర్ క‌పూర్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news