ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ (Diabetes) రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ వ్యాధి పిల్లల్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం! పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి కావడంతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ బారిన పడిన పిల్లల్లో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శరీర కణాలు గ్లూకోజు లేకపోవడంతో వారికి నీరసం కలుగుతుంది.
భరించలేని తల నొప్పి కలుగుతుంది. దీంతో పిల్లలు ఏడుస్తారు. పిల్లల శరీరంలో డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా దాహం కూడా వేస్తుంది. నిద్రలో తరచూ మూత్రం పోయడం కూడా పిల్లల డయాబెటిస్ లో భాగం. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు ఎప్పుడు నీరసంగానూ, నిద్ర పోతున్నట్లుగా ఉంటారు. అంతేకాదు బరువు కూడా బాగా కోల్పోవడం పిల్లల్లో డయాబెటిస్ లక్షణాల్లో ఒకటిగా చూడాలి.
టైప్ వన్ డయాబెటిస్ చికిత్స కోసం డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అందించాలి. ఈ డయాబెటీస్ పిల్లల్లో రావడానికి జీన్స్ కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన పిల్లలకు కొంతమందికి ఇంజెక్షన్ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొదట బ్లడ్ ప్రెషర్ వచ్చింది. ఇది కేవలం పెద్ద వారిలో కనిపిస్తుంది. తరువాత ఈ వ్యాధి మామూలు అయిపోయింది. ప్రతి ఇళ్లలో కచ్చితంగా బీపీతో బాధపడేవారు ఉండనే ఉంటారు. దీనికి మన పనుల్లో వచ్చిన మార్పులు. స్ట్రెస్ తగ్గడం. మన పూర్వీకుల్లో ఇది ఏమాత్రం అంతగా కనిపించేది కాదు. మన ఆహారంలో వచ్చిన మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం. ఈ తర్వాత డయాబెటీస్ పేషంట్లు కూడా ప్రతి ఇళ్లలో ఈ వ్యాధి బారిన పడినవారు ఉంటున్నారు. కానీ, ఇది పిల్లలకు కూడా వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తక్షణమే చికిత్స అందించాలి. మరి కొంత పిల్లల్లో అయితే, వారు పుట్టగానే డయాబెటీస్ వ్యాధితోనే పుడుతున్నారు.