గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారులోకం హీరోయిన్..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని ఆ తర్వాత హీరోయిన్గా గుర్తింపు పొందలేక పోయినవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకరు. కొత్త బంగారులోకం చిత్రంతో ఓవర్ నైట్ కి ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా.. ఈమె అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో ఐటెం సాంగ్ లలో కూడా నటించింది.

బీహార్ ప్రాంతానికి చెందిన ఈమె మొదట హిందీ సినిమాలలో నటించి ఆ తర్వాత సీరియల్స్ లో కూడా చైల్డ్ యాక్టర్ గా నటించింది. అలా చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అలా టాలీవుడ్లోకి అడుగు పెట్టింది శ్వేతా బసు ప్రసాద్. 2008 కొత్త బంగారులోకం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ 2010లో కలవర్ కింగ్ సినిమాలో చివరిగా నటించింది. ఇక టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయేసరికి 2014లో బాలీవుడ్ సినిమాలలో వెబ్ సిరీస్లలో నటించడం మొదలు పెట్టింది. తాజాగా గుణేగార్ అనే ఒక సిరీస్ లో నటిస్తున్నది.

ఈ క్రమంలోనే ఈ సిరీస్ విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో శ్వేత కూడా ప్రమోషన్లలో పాల్గొనింది. ఇక ఈ ప్రమోషన్లలో పాల్గొన్న శ్వేతాను చూసిన అభిమానుల సైతం ఆశ్చర్యపోయారు. కొత్త బంగారులోకం సినిమాలో చాలా క్యూట్ గా కనిపించే ముద్దుగుమ్మ 30 ఏళ్లకే ముదురు హీరోయిన్ గా మారిపోయింది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈమె కెరియర్ డౌన్ లో ఉన్నప్పుడే రోహిత్ మిట్టల్ అనే ఒక ఫిలిం మేకర్ ని వివాహం చేసుకుంది.. కానీ వివాహమైన ఏడాదికి వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది.