తొలి మ్యాచ్ లో ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇవాళ ఈ రెండు జట్ల మధ్య రెండో టి 20 మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ నాగపూర్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమ్ ఇండియాకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగే కీలక మార్పులతో టీమ్ ఇండియా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
India : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్/దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
Aus : ఆరోన్ ఫించ్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.