NANI : “అంటే సుందరానికీ” నుంచి సాంగ్ రిలీజ్.. పంచకట్టులో దుమ్ము లేపిన నాని

-

ప్రస్తుతం టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. గత ఏడాది డిసెంబర్‌ 24 వ తేదీన విడుదల అయిన… శ్యామ్‌ సింగరాయ్‌ కు కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. నాని క్రేజ్‌ మరింత పెరిగింది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాని చేస్తున్న మరో సినిమా “అంటే సుందరానికి”. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి “పంచ కట్టు” అనే సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ లో నేచురల్ స్టార్ నాని… పంచ కట్టులో కనిపించి.. అందరినీ అలరించాడు. అలాగే కామెడీగా ఈ సాంగ్ ఉండడంతో… నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ పూర్తి సాంగ్ ను ఆరో తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఈ చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news