భీమ్ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప టీజ‌ర్‌.. బ‌న్నీ అంటే ఆ మాత్రం ఉండాలి!

చాలామంది పెద్ద హీరోలు సినిమాలు విడుద‌లయ్యాక రికార్డులు సృష్టిస్తారు. కానీ ఐకాన్ స్టార్ మాత్రం కేవ‌లం టీజ‌ర్ తోనే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఎంతైనా ఐకాన్ స్టార్ క‌దా అంటారా! అవున‌నుకోండి కానీ కేవ‌లం టీజ‌ర్ తోనే ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పుడు మ‌రో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మ‌రి బ‌న్ని అంటే యూత్ లో ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి.


అస‌లే ద‌ర్శ‌క‌త్వంలో దిట్ట అయిన సుకుమార్ తెర‌కెక్కిస్తున్న సినిమా క‌దా అలాగే ఉంటుంది. ఇదే కాకుండా క‌థ బ‌లంగా ఉండ‌టం మ‌రో కార‌ణం. ఓ స్మ‌గ్ల‌ర్ గా బ‌న్నీ చేస్తుండ‌టంతో అభిమానుల్లో అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయ‌నే చెప్పాలి. త‌గ్గేదే లే అంటే టీజ‌ర్ లో ఒకే ఒక డైలాగ్ చెప్పిన బ‌న్నీ.. ఇప్పుడు రికార్డుల్లో కూడా త‌గ్గేదే లే అంటున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా వ‌స్తున్న‌ ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ బ్యానర్లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ బ‌ర్త్ డే కానుకగా ‘పుష్ప రాజ్’ పాత్రను పరిచయం చేస్తూ ‘పుష్ప’ టీజ‌ర్ ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. గూజ్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయండి. ఇక దీంతో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది పుష్ప‌. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డుని కూడా బ్రేక్ చేసి ఓ ప‌నైపోయింది బాబు అంటున్నాడు పుష్ప‌రాజ్‌. ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి వచ్చిన ఎన్టీఆర్ భీమ్ టీజర్
40 రోజుల్లో అత్యధికంగా 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు తెచ్చుకుంది. అయితే పుష్ప మాత్రం కేవ‌లం 11 రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదండోయ్ 44 మిలియన్ల పైగా వ్యూస్ ను తెచ్చుకుంది. చూడాలి మ‌రి ఇంకెన్నిరికార్డులు బ్రేక్ చేస్తుందో.