“భోళాశంకర్” ట్రైలర్ కి ముహూర్తం ఖరారు

-

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక యంగ్ హీరో సుశాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు మెహర్ రమేష్. తమిళంలో విజయం సాధించిన వేదాళం చిత్రానికి ఈ సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది మూవీ యూనిట్. ఈనెల 27న భోళాశంకర్ నుండి మెగా ట్రైలర్ విడుదల కానుందని చిత్ర బృందం నేడు అనౌన్స్ చేసింది. “అభిమానులు.. మెగా ఎంటర్టైనింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ” అంటూ దర్శకుడు మెహర్ రమేష్ అప్డేట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news