భార్యతో గొడవపడి ముద్దు పెట్టుకోవాలనుకున్న భర్త.. నాలుక గట్టిగా కొరికేసిన భార్య

-

సెక్స్‌ అయినా రొమాన్స్‌ అయినా పరస్పరం అంగీకారంతోనే చేయాలి. అలా కాకుండా బలవంతంగా చేస్తే చాలా కంపరంగా ఉంటుంది. కొన్ని భర్తకు మూడ్‌ ఉండదు. కొన్నిసార్లు భార్యకు మూడ్‌ ఉండదు. అప్పుడు వారి నిర్ణయాన్ని ఏకీభవించాలి కానీ నాకు కావాల్సిందే అంటే ఏమైనా జరగొచ్చు. గతంలో భర్త జననాంగాన్ని కట్‌ చేసిన ఘటనలు చూసే ఉంటారు. అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన జరిగింది. భర్త ఇష్టం లేకుండా ముద్దు పెట్టబోయాడని నాలుక కొరికేసింది ఆ భార్య. మాములుగా కొరకలేదు భయ్యా.. దెబ్బకి మనోడు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. ఆంధ్రపదేశ్‌లోని కర్నూల్‌ జిల్లాలో.!

కర్నూలులో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలని చూసిన భర్త నాలుకను కొరికి, గాయపరచింది భార్య. ప్రస్తుతం భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి 2015లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా ఎలాంటి విబేధాలు లేకుండా బాగానే ఉంటున్నారు. కట్ చేస్తే గత రెండేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. అయితే భార్యకు ఇష్టం లేకున్నా ముద్దుపెట్టేందుకు యత్నించాడు భర్త. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య అతని నాలుకను కోరికేసింది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండానికి చెందిన పుష్పవతిని పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతూ ఉన్నది. కానీ, రెండేళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత… భార్యను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు భర్త. ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో భార్య అతని నాలుకను బలంగా కొరికింది. దీంతో చంద్రానాయక్‌ నాలుక పైభాగంలో తీవ్ర గాయమైంది. చికిత్స కోసం భర్త చంద్రానాయక్‌ను గుత్తి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు తారాచంద్‌కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు. సో.. మోరల్‌ ఆఫ్‌దీ స్టోరీ ఏంటంటే.. భార్యలకు కోపంగా ఉన్నప్పుడు జర దూరం ఉండాలే కానీ వాళ్లతో సరసాలాడాలని చూస్తే ఇలానే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news