ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అటు రాజకీయ నాయకులు ఇటు పలువురు ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలపై రాజకీయ నాయకులు పెట్టుబడులు పెడుతూ ఒకింత గుర్తింపు తెచ్చుకుంటే భారత్ కి చెందిన ప్రముఖ క్రికెటర్లు కూడా సినిమా రంగంలో రాణించాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇకపోతే కొంతమంది స్టార్ క్రికెటర్లు తమిళ్ చిత్ర పరిశ్రమను నమ్ముకొని.. సర్వం పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరు తొలి సినిమాతోనే క్లీన్ బోల్డ్ అవ్వడమే కాదు సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగం గానే చెన్నై వదిలి వెళ్ళిపోతున్నారు.
మరి భారత్ కి చెందిన ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంత మేరా కష్టం వచ్చినా.. అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోని ఎక్కువగా నష్టపోయారని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు కూడా రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన లెట్స్ గెట్ మ్యారీడ్ అనే చిత్రాన్ని క్రికెటర్ ధోని నిర్మించగా రూ.8 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందించారు ఇందులో హరీష్ కళ్యాణ్ , ఇవానా, యోగిబాబు , నదియా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై పూర్తి ఫ్లాప్ అయ్యింది. ధోని ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ సంస్థ ద్వారా మొదటి సినిమానే ప్లాప్ అవడంతో తదుపరిచిత్రం గురించి ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇక నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాల విషయానికి వస్తే.. సదాగోపన్ బొట్ట బొట్టి అనే తమిళ చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. సినిమా ఫ్లాప్ అవడంతో మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు. ఇక తర్వాత ఫ్రెండ్షిప్ సినిమాతో హర్భజన్ సింగ్ కూడా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. వీరితోపాటు ఇర్ఫాన్ పఠాన్, క్రికెటర్ శ్రీశాంత్ వంటి వారు ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే చెన్నై వదిలి వెళ్ళిపోయారు.