మెగాస్టార్ సినీ కెరీర్నే మలుపుతిప్పిన టర్నింగ్ పాయింట్స్ ఇవే..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఒకడిగా అడుగు పెట్టి.. ఒకడిగానే ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఒక్కొక్కటి సాధిస్తూ రెండు దశాబ్దాలకు పైగా మొదటి స్థానంలోనే నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించే ఈయన ఇండస్ట్రీకి పెద్దన్నయ్యగా మారిపోయి.. అవసరం అయిన వారికి ఆర్థికంగా చేయూతను అందిస్తూ.. మరింత ఉన్నత స్థానానికి ఎదిగారు. ఇక ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాగా ఆయన గురించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు.. అయినప్పటికీ పునాదిరాళ్లు సినిమా అప్పటికే మొదలై.. మొదట విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు చిత్రం అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత దాదాపు 20 సినిమాలు చేసినా సరే హీరోగా ఆయనకి గుర్తింపు లభించలేదు. ఇక అదే సమయంలో 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాతో గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా లభించింది. అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు మరింత కలిసి వచ్చిందని చెప్పాలి.

మెగాస్టార్ క్రమశిక్షణ , సినిమాలపై ఉండే పిచ్చి ప్రేమ కారణంగా అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. అలా 1983లో కోదండరామిరెడ్డి తెరకేక్కించిన ఖైదీ సినిమా ద్వారా మొదటిసారి నంబర్వన్ స్థానం వైపు అడుగులు వేశారు. ఇక 1985లో చిరంజీవి అనే చిత్రంలో విలన్ గా కూడా నటించారు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ను ఓర్వలేక కొంతమంది మరణం మృదంగం సమయంలో ఆయన పై విష ప్రయోగం కూడా చేశారు. ఇక తర్వాత తన సినిమాల ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా సొంతం చేసుకున్న ఈయన 2008లో రాజకీయ పార్టీని మొదలుపెట్టి ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ 2017లో రీ యంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news