నంద‌మూరి ఫ్యామిలీలో ముగ్గురు హీరోలు న‌టించినా విడుదలకు నోచుకోని సినిమా ఇదే..!!

-

మ‌న తెలుగువారికి నందమూరి ఫ్యామిలీపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన త‌న అద్భుతమైన నటనతో వెండితెరను ఏలేసిన ఈయ‌న తెలుగువారి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌రాని ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజ‌కీయ నాయ‌కుడిగా.. ముఖ్య‌మంత్రిగా రాణించారు. ఇక ఈయ‌న కుటుంబం నుంచి ఎంద‌రో హీరోలు అటు వెండితెర‌తో పాటు.. ఇటు రాజ‌కీయాల‌కు సైతం ప‌రిచ‌య‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలోనే ఏ రంగమైనా నంద‌మూరి ఫ్యామిలీకి అది కొట్టిన పిండే అని నిరూపించుకున్నారు. మ‌రి ఇలాంటి గొప్ప కుటుంబంలో.. అది కూడా ముగ్గురు హీరోలు న‌టించిన సినిమా విడుద‌ల కాలేదు అంటే.. వినిడానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదే నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నందమూరి తారకరామారావు ప్రజానాయకుడిగా, ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రిగా కొన‌సాగుతున్న టైమ్‌లో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని నిర్మించారు. మ‌రియు ఈ చిత్రాన్ని హిందీ వెర్ష‌న్ కూడా అదే టైమ్‌లో నిర్మించారు.

అయితే ఈ చిత్రంలో రావణుడు, విశ్వామిత్రుడు, దర్శకత్వం, ఎడిటింగూ అన్ని ఎన్టీఆర్ గారే వ్య‌వ‌హ‌రించారు. అలాగే తెలుగు, హిందీ వెర్ష‌న్‌లోనూ బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్శంతుడుగా న‌టించారు. ఇక నంద‌మూరి చిన్నోడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ చిత్రం హిందీ వెర్ష‌న్‌లో దుశ్శంతుడు కొడుకైన భరతుడిగా న‌టించారు. కాని, ఈ సినిమా తెలుగులో అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. దీంతో హిందీ వెర్షెన్ షూటింగ్ అయిపోన‌ప్ప‌టికీ విడుద‌లను మాత్రం పెద్ద ఎన్టీఆర్ హోల్డ్‌లో పెట్టారు. ఆ త‌ర్వాత ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం విడుద‌ల కాలేదు. ఇలా నంద‌మూరి ఫ్యామిలీ నుంచి సీనియ‌ర్ ఎన్టీఆర్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రియు బాల‌కృష్ణ న‌టించ‌న‌ప్ప‌టికీ ఈ చిత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version