పేరుకే కన్నడ ముద్దుగుమ్మ.. తెలుగింటి ఆడపడుచులా..అత్యంత రూపకళా శిల్పవతి అయిన ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా సౌందర్య సినిమాలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అటు మాస్ ఆడియన్స్ అయినా.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ఈమెకు బ్రహ్మరథం పట్టాల్సిందే. ఇక సౌందర్య మరణించి మన మధ్య లేకపోయినా సరే ఆమెను మాత్రం గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఆమెను స్మరిస్తూనే ఉంటారు అనడంలో సందేహం లేదు. ప్రతి పాత్రలో కూడా లీనమైపోయి తన నటనతో అద్భుతమైన హావభావాలతో ఎవరినైనా సరే మెప్పించ గలిగిన గొప్ప నటనా మూర్తి.. అయితే ఇటీవల సౌందర్య 50వ శత దినోత్సవ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రముఖ హీరోయిన్ ఆమని బయట పెట్టడం జరిగింది.
సాధారణంగా సినిమాలలో ప్రేక్షకులను మెప్పించాలి అంటే గ్లామర్ పాత్రలు అవసరమని అందరూ అంటూ ఉంటారు. కానీ సౌందర్య మాత్రం గ్లామర్ అవసరం లేకుండా ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించింది రమ్యకృష్ణ , నగ్మా, రోజా, ఆమని, రంభ ఇలా అందరూ ఎక్స్పోజింగ్ లో దూసుకుపోతుంటే ఈమె మాత్రం ఏ మాత్రం గ్లామర్ లో హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ క్రమంలోనే ఒకరోజు ఆమని సౌందర్య తో హద్దులు దాటే అందాల ప్రదర్శనకు ఎందుకు దూరం అని అడిగిందట .. అప్పుడు సౌందర్య ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? రేపుటి రోజున ఎప్పుడైనా నాకు ఒక భర్త వస్తే నన్ను ప్రశ్నించడా? ఎందుకలా నటించావు అని అడుగుతారు కదా? ఒకవేళ రేపు నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చిందనుకో ..అప్పుడు డబ్బు కోసం ఇలా ఎక్స్పోజింగ్ చేసావా? అని అడిగితే..? ఒకవేళ పిల్లలు భర్తతో కలిసి నేను నటించిన సినిమాలు చూసేటప్పుడు వారు ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కదా అంటూ సౌందర్య ఆమని తో తెలిపినట్టు ఆమని ఇటీవల వెల్లడించింది . ఇకపోతే సౌందర్య సినిమాలలోకొచ్చే ముందే అలా ఫిక్స్ అయ్యి వచ్చిందట. ఇక ఎవరు స్టైల్ వాళ్లది కానీ సౌందర్య స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ అంటూ ఆమని స్పష్టం చేసింది.