డీజే టిల్లు -2 నుంచి హీరోయిన్స్ తప్పుకోవడానికి కారణం ఇదేనట..?

-

డీజే టిల్లు -2 చిత్రం ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇందులో హీరోగా నటించడమే కాకుండా రచయితగా కూడా వర్క్ చేయబోతున్నారు. గతంలో విడుదలైన డీజే టిల్లు సినిమాని డైరెక్టర్ విమల కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని కూడా ప్రకటించారు చిత్ర బృందం.

టిల్లు -2 అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కించడానికి మొదలుపెట్టారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా నేహా శెట్టి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా డైరెక్టర్నీ హీరోయిన్నీ మార్చేశారు సిద్దు. ఇక హీరోయిన్ స్థానంలో అనుపమాను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇందులో ఈమె హీరోయిన్గా అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ అనుపమ తప్పుకోవడంతో మడోనా సెబాస్టియన్ అంటూ ప్రచారం జరిగింది.

ఈమె కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో హీరోయిన్ మీనాక్షి దీక్షిత్, కేతిక శర్మ లను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఈ చిత్రాన్ని వాకౌట్ చేయడానికి గల కారణం ఏంటా అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.డీజే టిల్లు చిత్రంలో నేహా శెట్టి , సిద్దు మధ్య లిప్ లాక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అంతకుమించి ఈ చిత్రంలో పలు ఇంటిమేషన్ సీన్స్ ఉన్నాయట. దీంతో హీరోయిన్లు భయపడి సిద్దూతో ఆ పని చేయలేక హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి రైటర్గా సిద్దు కావడంతో ఇందులో పలు ఇంటిమేషన్ సీన్స్ రాసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version