యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఫ్యాక్ష బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ తో ఇదో పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ అనుకునేలా చేసిన త్రివిక్రం సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ను కూడా ఉంచాడట.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ హృదయాన్ని బరువెక్కేలా చేస్తాయని అంటున్నారు. ట్రైలర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఉన్న రెండు ఫైట్ సీన్స్ అందులో పెట్టారే తప్ప సినిమా ఎక్కువ భాగం ఎమోషనల్ గా వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. ఇక ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఆడియెన్స్ కు ఈ సెంటిమెంట్ కనుక నచ్చింది అంటే అరవింద సమేత రికార్డులు ఆపడం ఎవరి వల్లా కాదని అంటున్నారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతున్న ఈ మూవీ వీర రాఘ వీరత్వం తప్పక చూపిస్తుందని అంటున్నారు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన అరవింద సమేత సినిమాకు తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.